Breaking News

విద్యార్ధిని కవిత దహన కార్యక్రమానికి కేవలం ఏటిడబ్ల్యుఓ మాత్రమే హాజరు.

0 21

 కవిత మృతి పట్ల ఏటిడబ్ల్యుఓ తిరిపాల్ సంతాపం.


దహన కార్యక్రమం రోజు కేవలం ఏ టి డబ్ల్యూ ఓ మాత్రమే హాజరయ్యారు.


పాఠశాల సిబ్బంది,ఐటీడీఏ పరిధి అధికారులు ఎందుకు హాజరు కాలేదు?


గిరిజన విద్యార్థుల ప్రాణాలు అంటే అంత చులకన?


విద్యార్థుల మరణాలకు కారకులెవరు?

దహన కార్యక్రమం రోజు ఏటిడబ్ల్యుఓ తిరిపాల్

అల్లూరి జిల్లా,బంధవీధి బాలికల ఆశ్రమ పాఠశాల వద్ద ఆరవ తరగతి చదువుతున్న కొర్ర కవిత అనే విద్యార్థిని మూడు రోజుల క్రితం 17వ తారీఖు శుక్రవారం నాడు మరణించిన సంగతి అందరికీ విధితమే. కవిత మరణించిన రోజున జి.మాడుగుల మండల ఏ టి డబ్ల్యూ ఓ తిరిపాల్, ఎంఈఓ నాగభూషణం అలాగే పాఠశాల సిబ్బంది కవిత స్వగ్రామమైన అరగడపల్లి గ్రామానికి వెళ్లి కవిత మృతి పై సంతాపం తెలియజేశారు.

కవిత మరణించిన రోజు రాత్రి 2:30 గంటల వరకు ఏటిడబ్ల్యుఓ,ఎంఈఓ

ఏ టి డబ్ల్యూ ఓ, ఎంఈఓ కవిత మృతి చెందిన రోజు తెల్లవారుజాము 2:30 గంటల వరకు అక్కడే ఉండి దహన కార్యక్రమాల నిమిత్తం పదివేల రూపాయలు కుటుంబ సభ్యులకు ఇచ్చి వచ్చారు. అయితే మరుసటి రోజు శనివారం కవిత మృతదేహాన్ని దహనం చేయాల్సి ఉండగా కేవలం ఏ టి డబ్ల్యూ ఓ తిరిపాల్ మాత్రమే అరగడపల్లి వెళ్లడం జరిగింది. పాఠశాల సిబ్బంది గానీ, కవిత మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ఐటిడిఏ పరిధి అధికారులు గానీ ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.