కోడి పందాలు శిబిరంపై పోలీసుల దాడి.
అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలంలోని చింతవాని పాలెం గ్రామ శివారులో కోడిపందాలు ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు శిబిరంపై దాడి చేసి సుమారు 6 మంది వ్యక్తులను, అయిదు కోడిపుంజులను,5 బైకులు, 1000 రూపాయలు నగదును తమ పోలీస్ సిబ్బంది,ఏపీఎస్పీ సిబ్బంది సహాయంతో పట్టుకోవడమైనదని కొయ్యూరు ఎస్సై రాజారావు తెలిపారు.ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ రాజారావు తెలిపారు.