అల్లూరి సీతారామరాజు జిల్లా:గిడ్డి ఈశ్వరి గారూ… గిరిజనేతరులందరూ గిరిజన ద్రోహులు కారని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు అన్నారు.పాడేరు మెయిన్ రోడ్డు విస్తరణ విషయంలో అడ్డుపడుతున్న పాడేరు నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జ్ గిడ్డి ఈశ్వరి ఆదివాసీ సమాజం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఏమి మాట్లాడాలో అర్థంకాక గిరిజనేతర అధికారులను పంపించేద్దామనడం చర్చంచనీయంగా మారిందన్నారు.ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్డర్ ఇస్తేనే వారు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తున్నారు,అంతేకానీ వారు షెడ్యూల్ ఏరియాలో పని చేయాలని అడిగి ఉద్యోగంలో జాయిన్ కాలేదని,మీరన్నట్లు వారిని ప్రభుత్వం పంపిస్తే హాయిగా వెళ్ళి పోతారన్నారు.వ్యాపారం కోసం ఏజెన్సీలోకి వచ్చిన గిరిజనేతరులలో కొంతమంది ఆదివాసీ సామాజిక,ఆర్ధిక,రాజకీయాలల్లోకి ప్రవేశించి వారికి అనుకూలంగా మార్చుకున్నారని,మీలాంటి ఆదివాసీ నాయకుల అండదండలతో వారు చెలరేగిపోతున్నారని, వ్యాపారం నిమిత్తం వచ్చిన వారు వ్యాపారంతో పాటు ఈ ప్రాంతంలోని సంసృతి,సాంప్రదాయాలను,ఆచార వ్యవహారాలలో తలదూర్చుతున్నారన్నారు.మీలాంటి వారికి రాజకీయ పాఠాలు కూడా చెప్తున్నారని అన్నారు.అలాంటి వారితో మీలాంటి కొంతమందికి లాభం జరగవచ్చు కానీ ఆదివాసీ సమాజానికి తీవ్ర నష్టం జరుగుతోందని,ఆదివాసీ జెఏసి గా మేమందరం గిరిజనేతరులందరికి వ్యతిరేకం కాదు.గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులను గౌరవించే గిరిజనేతరులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని,ఆదివాసీల కోసం త్యాగాలు చేసిన అల్లూరి సీతారామరాజు,బిడి శర్మ,ఎస్ఆర్ శంకరన్,ఈఎఎస్ శర్మ లాంటి వారితో పాటు ఆదివాసీల కోసం ప్రాణత్యాగం చేసిన వెంపటాపు సత్యం,మరెందరో కామేడ్ల్రు ఉన్నారని చెప్పారు.ఈ ప్రాంతంలో ఎటువంటి మౌళిక సదుపాయాలు లేకపోయినా విద్యను అందించిన గిరిజనేతర ఉపాధ్యాయులు,ఆదివాసీల కోసం పనిచేసే లాయర్లు, మీడియా ప్రతినిధులు,ఎంతోమంది స్వచ్ఛంద సేవకులు,అధికారులు,అనధికారులు,నిజాయితీగా వ్యాపారం చేసుకునే వ్యాపారులు ఉన్నారని,ఆదివాసీ హక్కులను,చట్టాలను విస్మరించే గిరిజనులైనా, గిరిజనేతరులైనా ఆదివాసీ జెఎసి ఒకేలా చూస్తుందని,రెక్కాడితేగానీ
డొక్కాడని నిరుపేద గిరిజనేతరులు కూడా ఏజెన్సీలో ఉన్నారని,ఎవరైతే ఆదివాసీలను దోచుకుంటున్నారో వారినే శత్రువులుగా చూస్తాం తప్పా గిరిజనేతరులందరికీ మేం వ్యతిరేకం కాదని,ఆదివాసేతర అధికారులు ఆదివాసీ హక్కులు,చట్టాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే బరాబర్ వారిని కూడా వదలమని,గిరిజనేతరులందరూ మీరు అనుకున్నట్లు లేరని,వారు ఏ పని కోసం వచ్చారో ఆ పని చూసుకోవాలి తప్పా మిగతా విషయాలలో తలదూర్చకూడదని చెప్తున్నామన్నారు.మీరేదో కేసులు పెడతామంటున్నారు,జైలు కెళ్ళిన జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యారు,జైలుకెళ్ళిన చంద్రబాబునాయుడు కూడా సిఎం అయ్యారని,ఆఖరికి మీ మీద కూడా కేసులున్నాయని,మీ ఉడత ఊపులకు భయపడేది లేదని ఆయన వ్యగ్యంగా అన్నారు.