అల్లూరి సీతారామరాజు జిల్లా:పెసాచట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో గ్రామసభ గిరిజనులతో పెడతారు కానీ గిరిజనేతరులతో కాదని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు అన్నారు.కొయ్యూరు మండలం లోని ఆడాకుల గ్రామంలో గల గిరిజనేతరులు 1959,1970 సంవత్సరాలకు ముందు నుండే ఆ భూములు సాగుచేసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వగా,కలెక్టర్ విచారణ జరపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.ఆ విచారణలో వారికున్న పత్రాలు చూపించుకోవాలి.గతంలో లోతేటి శివశంకర్ సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు,నాయకులు గ్రామసభ తీర్మానం చేసారు కదా,ఆ తీర్మానం ఎందుకు చెల్లలేదని,1950 జనవరి 26న రాజ్యాంగం అమోదించబడింది.ఆ రోజే రాజ్యాంగంలోని 5,6వ షెడ్యూల్డ్స్ అమోదించబడ్డాయి.5,6 వ షెడ్యూల్డ్స్ లో గిరిజనేతరల గురించి ప్రస్తావనలేదు.ఇది 5 వ షెడ్యూల్డ్ కాబట్టి గ్రామసభ పెట్టి గిరిజనేతరుల గురించి ప్రస్తావించకూడదని,పెసా చట్టం ప్రకారం గ్రామసభ గిరిజనులకు మాత్రమే వర్తిస్తుంది కానీ గిరిజనేతరులకు కాదని మొట్టడం రాజబాబు అన్నారు.గ్రామసభ గిరిజనేతరులతో పెట్టడమే తప్పు అవుతుంది.తప్పే కాదు..చట్ట ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని,ఈ విషయమై కలెక్టర్ ని కలవగా ఆడాకుల ప్రాంత గిరిజనేతరులు 1959కి ముందు నుండే ఆ భూములు మావి అని పట్టాలివ్వాలని కోరారని,విచారణ జరిపిస్తున్నామని అన్నారని,మండల రెవెన్యూ అధికారులు మాత్రం పెసా చట్టానికి వ్యతిరేకంగా గ్రామసభ ఈ నెల 19న నిర్వహిస్తామనడం చట్ట ఉల్లంఘన అవుతుందని, గ్రామసభ జరిపితే కోర్ట్ లో కేసు వేస్తామని హెచ్చరిస్తూ, ప్రజాప్రతినిధులు చట్టం తెలియకుండా సంతకాలు పెడితే క్రిమినల్ కేసులు ఎదురుకోవల్సి వస్తోందని ఆయన రాజబాబు హెచ్చరించారు.