Breaking News

మాతా శిశు మరణాలు సంభవిస్తే సిబ్బంది పై వేటు తప్పదు- డి.యల్.పి.ఓ కుమార్.

0 16

మాతా శిశు మరణాలు సంభవిస్తే సిబ్బంది పై వేటు తప్పదు- డి.యల్.పి.ఓ కుమార్.


అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం:ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వెల్ఫేర్ అసిస్టెంట్లు,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,మహిళా పోలీసులు పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను తనిఖి చేసి వివరాలు సి.ఆర్.మొబైల్ యాప్ లో నమోదు చేయాలని, పౌష్టికాహార లోపం వున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,మాతా,శిశు మరణాలు సంభవిస్తే సంబంధిత సిబ్బంది పై వేటు తప్పదని పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి  పీ.ఎస్.కుమార్ హెచ్చరించారు. 


సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులతో సమీక్ష నిర్వహించి జలజీవన్ మిషన్ పనులు,పన్నుల వసూళ్లు, ముఖ ఆధారిత హాజరు, త్రాగునీటి సరఫరా, పౌర సేవలు, పారిశుధ్య నిర్వహణ, స్పందన, ఎన్నికల కోడ్ అమలు తదితర అంశాలపై సమీక్షించారు. మార్చి 31నాటికి అన్ని పంచాయతీలలో వంద శాతం పన్ను వసూలు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. విధులకు తరచుగా గైర్హాజరు అవుతున్న కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే జీతభత్యాలు నిలిపివేయాలని యం.పి.డి.ఓకు సూచించారు.


పారిశుధ్య నిర్వహణ నిరంతరం సక్రమంగా జరగాలన్నారు.గ్రామపంచాయతీల నుండి అందిస్తున్న పౌర సేవలపై పంచాయితీ కార్యదర్శులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. డెత్, బర్త్ తదితర సర్టిఫికెట్లను నిర్ణీత సమయంలో అందజేయాలన్నారు.వలసలు నివారించేందుకు ఉపాధిహామీ పథకంలో లేబర్ మొబలైజేషన్ జరగాలని సూచించారు.

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి, లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. యం.పి.డి.ఓ మేరీ రోజ్ ,ఈ ఓ.ఆర్డీ ఆర్.పి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.