అల్లూరి సీతారామరాజు జిల్లా:ఏ అధికారంతో గిడ్డి ఈశ్వరి అధికారులతో రివ్యూ మీటింగ్ పెడతారని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు ప్రశ్నించారు.గిడ్డి ఈశ్వరీ,పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ పేరుతో మండలస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినందున,ఆ సమావేశానికి మండల స్థాయి అధికారులు హాజరు కావాలని జి మాడుగుల ఎంపీడీఓ వాట్సప్ మెసేజ్ చూసి ఆశ్చర్యానికి గురయ్యామన్నారు.పాడేరు నియోజకవర్గం తెదేపా కు గిడ్డి ఈశ్వరి ఇంచార్జ్,అంతేకానీ అధికారులకు కాదని,ఒకవేళ అధికార పార్టీ అనుకుంటే తెదేపా ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి తో పాటు జనసేన ఇంచార్జ్ గంగులయ్య,బిజెపి ఇంచార్జ్ కూడా క్రిష్ణారావు లేదా కురసా ఉమమహేశ్వర్రావులు ఉన్నారని,వారందరూ రివ్యూలు పెడితే అధికారులు హజరౌతారా అని ప్రశ్నించారు.రివ్యూ పెట్టమని ప్రభుత్వ ఆదేశాలు ఏమైనా ఉన్నాయా,ఎటువంటి ఆదేశాలు లేకుండా అధికారులు ఎలా హాజరవుతారని,అలా హాజరైతే ఆమె నియోజకవర్గానికే ఇంచార్జ్,మేం రాష్ట్రానికే ఇంచార్జ్ గా ఉన్నాం,మేం కూడా రివ్యూస్ పెడతామని, అధికారులు హజరవుతారా అని ప్రశ్నించారు.ఓడిపోయినోళ్ళు రివ్యూ పెట్టడానికి సిగ్గుగా లేదా అని,అధికారులు ప్రోటోకాల్ మర్చిపోతే ఎలా అని అన్నారు.ఇక్కడ ప్రజామోదంతో గెలిచిన ఒక ఎమ్మెల్యే,ఎంపీ ఉన్నారనే సృహా కూడా అధికారులకు లేకపోవడం బాధాకరని అన్నారు.ఓడిపోయిన గిడ్డి ఈశ్వరి తో రివ్యూలు జరుపుతున్న అధికారులు కలెక్టర్ అనుమతితోనే హజరవుతున్నారా?అధికార కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం జరగాలి కానీ చట్ట విరుద్ధంగా జరిపితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.