Breaking News

జగనన్న గెలుపు కోసం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేద్దాం: పాడేరు ఎమ్మెల్యే

0 18

జగనన్న గెలుపు కోసం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేద్దాం.

గృహసారథులు,కన్వీనర్లు,పార్టీ శ్రేణుల సమావేశంలో పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.


అల్లూరి సీతారామరాజు జిల్లా: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆదివాసీలకు చేకూర్చిన లబ్ధిని వివరించి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అంతా కలిసి పనిచేద్దామని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. అంతా ఒక టీమ్‌గా ప‌ని చేస్తే గ‌తం కంటే ఎక్కువ మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

పాడేరులోని శ్రీ మోదకొండమ్మ ఆడిటోరియంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు, గృహసారథులు,పార్టీ శ్రేణులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జెడ్పిటిసిలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే గిరిజనులకు లబ్ధి చేకూర్చిన పరిస్థితులు లేవని కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అండగా నిలిచారని చెప్పారు.


ఇంత‌క‌ముందు పాలించిన పాల‌కులు ఎవ్వ‌రూ గిరిజ‌నుల సంక్షేమానికి కృషి చేసిన సంద‌ర్భాలే లేవ‌ని భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. మ‌న ప్రభుత్వం చేసినటువంటి మేలును గడపగడపకు వెళ్లి గ‌ణాంకాలతో స‌హ వివరించగలిగితే జగన్మోహన్ రెడ్డి ని ఆదరించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులకు అత్యధిక లబ్ధి చేకూరిందని దానిని వివరించి ఓట్లుగా మలుచుకోవడంలో విజయవంతం కావాలని అన్నారు.


ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనినీ వివరించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ముందుకు రావాలని పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు తాను వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల వారు చూపుతున్న ప్రేమ ఆప్యాయతలను మరువబోలేమని చెప్పారు. ప్రతి గృహ సారథి వారికప్పగించినటువంటి గడపల్లో నిత్యం పర్యవేక్షణ చేస్తూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా గెలిస్తే ఎటువంటి మేలు జరగబోతుందన్న విషయంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గం పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ శతక బుల్లి బాబు, ఏఏంసి చైర్మన్ కూతంగి సూరిబాబు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మినుములు సరస్వతి, ఎంపీపీ, ఎంపీటీసీలు,సర్పంచులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు,మండ‌ల సచివాలయ క‌న్వీన‌ర్లు, గృహసార‌థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.