Breaking News

అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి- సి ఆర్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సచ్చితానంద్ పాత్ర.

0 20

 సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి- సి ఆర్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సచ్చితానంద్ పాత్ర.


రిపోర్టర్: సునీల్ ప్రసాద్.

అల్లూరి సీతారామరాజు జిల్లా,జీకే వీధి మండలం: గిరిజనులు ఆసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఏ/234 సి ఆర్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సచితానంద్ పాత్ర అన్నారు. జీకే వీధి మండలంలోని పెదవలస అవుట్ పోస్ట్ పరిధిలో గల కొత్తవలస,తూరు మామిడి,నేరెళ్ళబంద, పెదవలస, ఇంకా ఇతర గ్రామాల్లో సి ఆర్ పి ఎఫ్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు.


ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ సచ్చితా నంద్ పాత్ర మాట్లాడుతూ ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సిపిఐ మావోలిస్టులకు దూరంగా ఉండాలన్నారు. అటువంటి వారు ఎవరైనా గ్రామాలకు వస్తే వారిని ఆదరించకండి అని భోజనాలు పెట్టడం వంటివి చేస్తే చాట్టారీత్యా నేర మన్నారు.

అలాగే గంజాయి పంట మాని సాంప్రదాయ పంటలపై దృష్టి పెట్టి అధిక లాభాలు అర్జించాలన్నారు.అమాయక గిరిజనులు మధ్యవర్తుల మాటలు నమ్మి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని గంజాయి విక్రయాలు, రవాణాలకు పాల్పడి బంగారు భవిష్యత్తును జైలు పాలు చేసుకోవద్దని ఆయన హితావు పలికారు. గ్రామాల్లో నాటుసారా విక్రయాలు, దొంగతనాలు, జరిపితే వాటిని నిర్మూలించవలసిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. నాటు సారా సేవించడం వలన ఒళ్ళు గొల్ల చేసుకోవడమే కాకుండా అనవసరపు తగాదాలతో కుటుంబాలకు, భార్యా పిల్లలకు దూరంకావలసి వస్తుందన్నారు. అనంతరం గ్రామస్తులకు యువతకు వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు, ఎఫ్ఎం రేడియోలు, ఇతర సామాగ్రిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.