అగ్నిబాధిత కుటుంబాలను పరామర్శించిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం, అంతాడా పంచాయతీ లోని తాటిమాను పాలెం గ్రామంలో బుధవారం నాలుగు ఇల్లులు అగ్నికి ఆహుతి అయ్యాయి.
స్థానిక సర్పంచ్ సుర్లచంద్రరావు ద్వారా ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి హుటాహుటిన మండలంలోని నాయకులతో కలిసి ఆ గ్రామానికి చేరుకుని నాలుగు ఇళ్లల్లో నివసిస్తున్న ఏడు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు అందించారు.
తదుపరి సహాయం నిమిత్తం స్థానిక ఎమ్మార్వో తిరుమలరావుకి ఆస్తి నష్టం అంచనా వేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయం అందేటట్లు చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ విషయాన్ని కలెక్టర్ కి కూడా తెలియజేసి అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండాకాలం వచ్చినందున అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈ సంఘటనను చూసిన కెసిఎన్ సభ్యులు స్వామి వెంటనే కేసీఎన్ ట్రస్ట్ తరఫున ఏడు కుటుంబాలకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
నాలుగు ఇల్లులు అగ్నికి ఆహుతి అవడంతో ఏడు కుటుంబాల వారు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్నారు.
దీంతో వారికి కావాల్సిన బట్టలు కూడా కొని మండల వైసీపీ పార్టీ నాయకులతో పంపిస్తానని ఎమ్మెల్యే అన్నారు.
అలాగే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఫోన్లో మాట్లాడారు.
వెంటనే తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయలు చొప్పున లక్ష 75 వేలు రూపాయలు అందిస్తామని బాధితుల బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పంపించే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రరావు,ఎంపీపీ బడుగు రమేష్,వైసిపి పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు,ఏఎంసీ చైర్పర్సన్ జైతి రాజులమ్మ, ఎమ్మార్వో తిరుమల రావు,ఏఎంసి డైరెక్టర్ పీ.అచ్యుత్, మండల కన్వీనర్ బండి సుధాకర్,మాజీ మండల అధ్యక్షుడు సుమర్ల సూరిబాబు,పాటి శేఖర్, సావిత్రి, శోభన్, శ్రీను, ప్రసాద్ వనుంబాబు, స్థానిక ఎంపీటీసీ మరి కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.