Breaking News

అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించి బట్టలు నిత్యావసర సరుకులు అందించిన దుమంతి సత్యనారాయణ.

0 24

 నిన్న బుధవారం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీలోని తాటిమానుపాలెం గ్రామంలో నాలుగు ఇల్లులు అగ్నికి దగ్ధమై ఏడు కుటుంబాలు నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.

ఈ విషయం తెలుసుకున్న కొయ్యూరు తాహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దుమంతి సత్యనారాయణ ఈరోజు ఆ గ్రామానికి చేరుకుని ఏడు కుటుంబాల వారికి కూరగాయలు, బకెట్లు సుమారుగా 150 జతల బట్టలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న తోటి వారికి తోడ్పాటు అందించడం నా బాధ్యతగా భావిస్తున్నానని కొంతమంది స్నేహితుల సహాయంతో ఈ కార్యక్రమం చేశానని దుమంతి సత్యనారాయణ అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుర్ల చంద్రారావు, సుంకరి బాలేసు, దుమంతి రామకృష్ణ,దుమంతి కిరణ్, దుంప సతీష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.