తరగతి గదిలో పడుకుని ఉంటున్న ఉపాధ్యాయుడు మాకొద్దు… సర్పంచ్ రమేష్.
అల్లూరి జిల్లాలోని సర్కారు బడులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన బోధన అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు.విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోటకు ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.ఈ నేపథ్యంలో అరకులోయ మండలంలోని బస్కీ పంచాయతీ పరిధి దేవరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బస్కీ పంచాయతీ సర్పంచ్ పాడి.రమేష్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాల మూమెంట్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు.ఇందులో భాగంగా ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఒకరు మాత్రమే విధులకు హాజరై ప్రధానోపాధ్యాయుడు విధులకు డుమ్మా కొట్టారు.దీనితో ప్రధానోపాధ్యాయుడు రామన్న విధుల పట్ల సర్పంచ్ రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.దీనితో సర్పంచ్ రమేష్ విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా పాఠశాల సమస్యపై ఆరా తీయగా ప్రధానోపాధ్యాయుడు రామన్న వారంలో రెండు మూడు రోజులు మాత్రమే విధులకు హాజరైనప్పటికీ తరగతి గదిలో పడుకుని ఉంటూ నవరత్న నూనె ప్యాకెట్లు తెప్పించుకొని విద్యార్థులతో తలకు మర్దన చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి సారు మాకొద్దు వేరే టీచర్ ను నియమించాలని తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని సర్పంచ్ రమేష్ కు విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు.అనంతరం సర్పంచ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ..దేవరపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామస్తుల సమక్షంలో గ్రామ సభ ఏర్పాటు చేశామన్నారు.ఈ సభలో భాగంగా ప్రధానోపాధ్యాయుడు రామన్న హాజరవ్వగా సార్ మీరు పాఠశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని హాజరైనప్పటికీ విద్యార్థులకు పాఠాలు బోధించకుండా పడుకొని ఉంటున్నారని అడగమన్నారు.దీనితో ప్రధానోపాధ్యాయుడు రామన్న రెచ్చిపోయి నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటానని మీరు సీఎంకి ఫిర్యాదు చేస్తారో పిఎంకి ఫిర్యాదు చేస్తారో నన్ను పీకేవారు ఎవరు లేరని సర్పంచ్ కు గ్రామస్తులకు ప్రధానోపాధ్యాయుడు రామన్న దుర్భాషలాడారాని సర్పంచ్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే విద్యార్థుల చేత తలకు మర్దన చేయించుకోవడం తరగతి గదిలో పడుకొని ఉండడం సరికాదని ఆరోపించారు.ఈ ఉపాధ్యాయుడు మాకొద్దని వేరే ఉపాధ్యాయుడుని దేవరపల్లి పాఠశాలలో నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు.ఈ సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు,జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ జయశ్రీ గ్రామస్తులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.