Breaking News

సారుబయలు సమస్యలు పరిష్కరిస్తా: పాడేరు ఎమ్మెల్యే

0 219

*గిజనులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు.
*గిరిజన ప్రాంత ప్రజలకు అండగా ఉంటాను.
*సారుబయలు గ్రామ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

(అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం):జి.మాడుగుల మండలం సొలభంగి పంచాయితీ సారుబయలు పీవీటీజీ గ్రామనికి చెందిన గిరిజనులు గత 50 ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనులకు ఇల్లులు కట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు కి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.శాసనసభ్యులు వెంటనే స్పందించి ఆ గ్రామానికి వెళ్లి అక్కడ వారియొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు.గ్రామస్తులు ఎమ్మెల్యే కి గ్రామంలో ఉన్న సమస్యలు గురించి విన్నవిస్తూ గ్రామంలో 50 ఏళ్లుగా 20 కుటుంబాలు నివసిస్తున్నాం కానీ ప్రస్తుతం ప్రభుత్వం తరుపున మంజూరైన 12 గృహాలకు ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. అలాగే సుమారు 25 మంది విద్యార్థులు ఉన్నారని,కనీసం పాఠశాల భవనం లేక గ్రామస్తులు చొరవతో ఒక పాక నిర్మించి అందులో పాఠాలు నేర్పిస్తున్నారని,కనీసం ఉపాధ్యాయుడు లేక పిల్లలు చదువు పట్ల అసంతృప్తి చెందుతున్నారు అని అన్నారు.ఎమ్మెల్యే గ్రామస్థులతో మాట్లాడుతూ మీకు ఇళ్ళులు కట్టుకోవడానికి అధికారులతో మాట్లాడి అనుమతి ఇచ్చేలా చొరవ తీసుకుంటానని భరోసా ఇచ్చారు.పాఠశాల భవనం, ఉపాధ్యాయుని,భాషా వాలంటీర్ ని నియమించేలా అధికారులతో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నుర్మాని మత్స్యకొండ నాయుడు,స్థానిక సర్పంచ్ ఐషారం హనుమంతరావు,సర్పంచుల ఫోరం అధ్యక్షులు సురభంగి రామకృష్ణ,లువ్వసింగి ఎంపిటిసి దొర,జి.మాడుగుల సర్పంచ్ కిముడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.