అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం: కొయ్యూరు మండలం బాలారం పంచాయితీ గ్రామంలో అలాగే రాజేంద్ర పాలెం గ్రామంలో దీపం 2.0 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యంవివి ప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంవివి ప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలారం స్థానిక సర్పంచ్ అప్పలనరస,రాజేంద్రపాలెం సర్పంచ్ పీటా సింహాచలం, కొయ్యూరు సర్పంచ్ బాలరాజు,రేవళ్ళ సర్పంచ్ వెంకటలక్ష్మి,మాజీ జెడ్పిటిసి గాడి శ్రీరామూర్తి టీడీపీ నాయకులు వరహాల బాబు,రమణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prev Post