అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని చింతలపూడి గ్రామంలో ఎదురెదురుగా వస్తూ రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ప్రయాణిస్తున్న వారిలో కొందరికి స్వల్ప గాయాలు అవ్వగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
రెండింటిలో ఒకటి చాపరాతిపాలెం మరొకటి రొబ్బసింగి కి చెందిన ఆటోలుగా స్థానికులు చెప్తున్నారు. వెంటనే 108 వాహనం అక్కడికి చేరుకొని గాయాలైన వారిని రాజేంద్రపాలెం పి.హెచ్.సి కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.