Breaking News

ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలుపుకై విస్తృత ప్రచారం.

0 19

 ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా సీతంరాజు సుధాకర్ ని గెలిపించండి.

కొయ్యూరు లో ఎస్టీ కమిషన్ మెంబర్ మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

ఎంపీపీ బడుగు రమేష్ పట్టభద్రుల ఓటర్లకు అభ్యర్థన.


అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలంలో బుధవారం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి అయిన సీతంరాజు సుధాకర్ గెలుపుకై మండలంలోని ఏ పీ ఆర్ కళాశాల,ఏ పీ ఆర్ స్కూల్,బాయ్స్-1,బాయ్స్-2,హై స్కూల్,కస్తూర్బా గాంధీ పాఠశాల,బాలికల ఆశ్రమ పాఠశాల,తాహశీల్దార్ కార్యాలయం, రాజేంద్ర పాలెం ప్రైమరీ స్కూల్ లలో సుమారుగా 100 మందిని పైగా పట్టభద్రులును కలిసి వివిధ గ్రాడ్యుయేట్ యువకులను కలిసి సీతంరాజు సుధాకర్ ని మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.


మీ అమూల్యమైన ఓటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జైతి రాజులమ్మ,మండల కన్వీనర్‌ బండి సుధాకర్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్,సర్పంచ్ సోమన్నదొర,కోడా రాజుబాబు,పాటి శేఖర్,రీమల గంగాధర్,వనుంబాబు,బల్లా ప్రసాద్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.