Breaking News

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలల్లో బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పి.వి.ఎన్.మాధవ్ ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.

0 14

 ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలల్లో బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పి.వి.ఎన్.మాధవ్ ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.

అల్ ఇండియా లేబర్ బోర్డు కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ నారాయణ.


అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్తవీధి: 

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు,జీ.కే.వీధి,చింతపల్లి,జి.మాడుగుల పాడేరు మండలాలలో పర్యటించిన ఆల్ ఇండియా లేబర్ బోర్డు కమిషన్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నడియడిన ప్రదేశాలను అభివృద్ధి చేస్తూ,అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం,మెడికల్ కాలేజి అన్ని మారుమూల ప్రాంతాలను కలిపే హైవే రోడ్ల నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుంటుందని బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పి.వి.ఎన్ మాధవ్ ని పట్టభద్రులందరూ మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారని ఇంకా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు మరొక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జీకే వీధి మండల అధ్యక్షులు వనపాల జోగిరాజు, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు, బిజెపి ఉపాధ్యక్షులు బోండ్ల చిరంజీవి, బిజెపి అరకు పార్లమెంట్ కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దుక్కేరి.ప్రభాకరరావు, బిజెపి జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కాకూరు శేఖర్,బిజెపి నాయకులు గెమ్మెలి.త్రినాథ్ దుక్కేరి.శంకరరావు మొదలగు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.