సీతంరాజు సుధాకర్ గెలుపుకై విస్తృత ప్రచారం.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొయ్యూరు మండల వైసీపీ పార్టీ నాయకులు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కంఠారం పంచాయతీ గ్రామంలో పట్టభద్రుడైన బచ్చల చిలుకుబాబు ని కలిసి వైసీపీ పార్టీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్,ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, మండల కన్వీనర్ బండి సుధాకర్,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్,చీడిపాలెం సర్పంచ్ సోమన్న దొర,బల్లా ప్రసాద్,వనుంబాబు,రామరాజు పాల్గొన్నారు.