Breaking News

డౌనూరు పీహెచ్సీ లో జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమం.

0 16

 డౌనూరు పీహెచ్సీ లో జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమం.


 నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం,డౌనూరు పి.హెచ్.సి లో డాక్టర్ లలిత ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నులిపురుగుల నివారణ కొరకు జాగ్రత్తలు తీసుకోవాలని,సరైన సమయంలో మందులు వేసుకోవాలని ఆశా కార్యకర్తలకు,ఏ ఎన్.ఎమ్ లకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొయ్యూరు మండల ఎంపీడీఓ మేరీరోజ్,పీ హెచ్ సి ఉద్యోగులు డాక్టర్ లలిత,సూపర్వైజర్ జె.రాణి, డౌనూరు ఏ.ఎన్.ఎమ్. నీలపు తలుపులమ్మ (లత),సత్య తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.