Breaking News

అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించిన వైసీపీ నేతలు.

0 17

 బాధిత కుటుంబాలకు సహాయం అందించి ఆదుకోండి:

 ఏఎంసి చైర్ పర్సన్ రాజులమ్మ,జెడ్పీటీసీ వారా నూకరాజు.

అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలంలో అగ్ని బాధిత కుటుంబాలను దాతలు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని చింతపల్లి ఏఎంసీ చైర్పర్సన్ రాజులమ్మ కోరారు. మండలంలోని అంతాడ పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో  సంభవించిన అగ్ని ప్రమాదంలో మూడు తాటాకిళ్ళు దగ్ధమై మూడు కుటుంబాల గిరిజనులు నిరాశ్రయులయ్యారు.అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలను ఏఎంసీ చైర్పర్సన్ జైతి రాజులమ్మ, జడ్పిటిసి వారా నూకరాజు,డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు, స్థానిక సర్పంచ్ చందర్రావు,రీమల గంగాధర్,నేగుల లక్ష్మణ్ రావు,సిపిఐ మండల కార్యదర్శి ఇరువాడ దేవుడు  తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు బియ్యం, కూరగాయలు,చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలను దాతలు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని కోరారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయ సహకారాలు అందించే విధంగా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.హామీ ఇచ్చినట్లు గానే వెంటనే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో సమస్యను వివరించారు.

స్పందించిన కలెక్టర్ బాధితులకు తక్షణ సహాయంగా 25వేల రూపాయలు,అలాగే సామాగ్రిని ఏర్పాటు చేస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.