Breaking News

నేను సైతం శివప్రసాద్ సూచన మేరకు పాఠశాలకు వాటర్ ప్లాంట్, ప్రింటర్ వితరణ.

0 15

 నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివప్రసాద్ సూచన మేరకు పాఠశాలకు వాటర్ ప్లాంట్,ప్రింటర్ వితరణ చేసిన భద్రాచలం పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం.


ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం,కొయ్యూరు మండలంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్,సెక్రటరీ వరలక్ష్మి,కరస్పాండెంట్ తో కలిసి నేను సైతం శివప్రసాద్ సందర్శించి పాఠశాలకు వాటర్ ప్లాంట్,ప్రింటర్ ఉచితంగా అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ అలాగే పాల్ రాజ్ ఇంజినీరింగ్ కాలేజ్ యాజమాన్యం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని  ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలను కొన్నింటిని దత్తత తీసుకొని పాఠశాలలకు కనీస సదుపాయాల కల్పనకు తోడ్పాటు అందిస్తామని పేర్కొని త్వరలో మరిన్ని పాఠశాలకు కనీస సౌకర్యాలు అందించేలా చర్యలు చేపట్టే శుభ సందర్భంగా మొదటగా ఈ పాఠశాలకు వాటర్ ప్లాంట్,ప్రింటర్ అందజేయడం జరిగిందని తెలిపారు.

అనంతరం మండలంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా సందర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ నర్సి కిరణ్,ఎంపీటీసీ వంతల బాబురావు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.