Breaking News

అగ్ని బాధిత కుటుంబాలకు దుమంతి సత్యనారాయణ,కుమారి దంపతులు బట్టలు పంపిణీ.

0 15

 మూడు తాటాకు ఇల్లులు దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబాలకు బట్టలు అందించిన దుమంతి సత్యనారాయణ,కుమారి దంపతులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అంతాడ పంచాయితీ లోని కొత్తపల్లి గ్రామంలో ఈనెల 12వ తేదీన రాత్రి  మూడు తాటాకు ఇల్లులు దగ్ధమై నిరాశ్రయులైన మూడు కుటుంబాలకు కొయ్యూరు తాహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దుమంతి సత్యనారాయణ,కుమారి దంపతులు బుధవారం గ్రామానికి చేరుకుని ఒక్కొక్కరికీ రెండు జతల బట్టలు, దుప్పట్లు, కూరగాయలు 25 కేజీల చొప్పున బియ్యం అందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రరావు,దుమంతి రామకృష్ణ, రీమెల గంగాధర్,సుంకరి రాములమ్మ, బాలేసు,వార్డు మెంబర్ బుజ్జి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.