Breaking News

ఎమ్మెల్యే చొర‌వ‌తో సీలేరు మారెమ్మ ఆల‌యం వ‌ద్ద అమ్మవారి పుణ్యస్నానాలు ఘాట్ నిర్మాణం

0 17

 ఎమ్మెల్యే చొర‌వ‌తో సీలేరు మారెమ్మ ఆల‌యం వ‌ద్ద అమ్మవారి పుణ్యస్నానాలు ఘాట్ నిర్మాణం


సీలేరు: అల్లూరి జిల్లా గూడెం కొత్త‌వీధి మండ‌లం సీలేరులో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి చొర‌వ‌తో విడుద‌లైన నిధుల‌తో నిర్మిస్తున్న అమ్మ‌వారి పుణ్య‌స్నానాలు ఘాట్ నిర్మాణం తుది ద‌శ‌కు చేరుకుంది. సీలేరు మారెమ్మ ఆలయం వద్ద మండల నిధులతో నిర్మిస్తున్న అమ్మవారి పుణ్యస్నానాలు ఘాట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. సీలేరు గ్రామదేవత మారెమ్మ ఆలయం వద్ద నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. అదేవిధంగా మన్యం శభరిమలైగా పేరుగాంచిన అయ్యప్ప ఆలయం కూడా అమ్మవారి ఆలయం ప్రక్కనే ఉంది. ఈ ఆలయాలకు వచ్చే భక్తులు స్నానాలు చేయడానికి, అమ్మవారి ఉత్సవాలు సమయంలో కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని, భ‌క్తులు అగ‌చాట్లు ప‌డుతున్నార‌ని, స్థానిక గ్రామపెద్దలు విషయాన్ని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పుణ్యస్నానాలు ఘాట్ నిర్మించడానికి చొరవ తీసుకోవాలని ఆమెను కోరారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి ఎంపీపీ బోయిన కుమారితో మాట్లాడి రూ.5 లక్షలు రూపాయలు మండ‌ల‌ నిధులు విడుదలయ్యేలా కృషిచేసారు. ఈ మేరకు మండల నిధులు విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. యుద్దప్రాతిపదికన పనులు చేపట్టడంతో ప్రస్తుతం అమ్మవారి పుణ్యస్నానాల ఘాట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. చిన్న చిన్న ప‌నులు మిన‌హా మిగ‌తా ప‌నులు పూర్త‌య్యాయని, పనులు పూర్తికావడంతో త్వరలో ఎమ్మెల్యే చేతులు మీదుగా పుణ్యస్నానాలు ఘాట్ ప్రారంబిస్తామని పీఆర్ జేఈ జ్యోతిబాబు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.