Breaking News

కెజిహెచ్ లో గిరిజన రోగుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి:అర్జున్ రెడ్డి, జిల్లా సమాచార హక్కు చట్టం కో కన్వీనర్.

0 17

కెజిహెచ్ లో గిరిజన రోగుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి:అర్జున్ రెడ్డి, జిల్లా సమాచార హక్కు చట్టం కో కన్వీనర్.


 విశాఖపట్నం కెజిహెచ్ లో ఓ గిరిజన బాలిక వారం రోజుల క్రితం నుంచి విశాఖపట్నం కెజిహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ… తుది శ్వాస విడిచింది.

పోస్ట్ మార్టం తదుపరి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని, అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని కెజిహెచ్ సూపరింటెండెంట్, ఎస్టీ సెల్ సిబ్బంది చెప్పడం జరిగిందని 

అదే విధంగా రాత్రి ఒంటిగంట సమయంలో ముంచంగిపుట్టు సీఏ హెచ్ స్కూల్లో ఓ గిరిజన విద్యార్థి మరణించడం జరిగిందని 

ఈ విషయం గురించి ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ తో చర్చించడం జరిగిందని

ఈ తరచూ విద్యార్థిని విద్యార్థుల మరణాలకు అందరి లోపాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పాఠశాల, కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని 

వెంటనే హెల్త్ అసిస్టెంట్ లను పాఠశాల, కళాశాలలో నియమించక పోతే మరణాలు సంభవిస్తూనే ఉంటాయని అర్జున్ అన్నారు.

ఈ మరణాల గురించి మన ఎమ్మెల్యే, ఎంపీలు కూడా వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళడంలో నిర్లక్ష్యం అవగాహన కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇన్ని మరణాలు జరిగిన తర్వాత కూడా మౌనం వహించడం చాలా బాధాకరం, విచారకరం అన్నారు.

అదే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలా మరణిస్తే, ప్రపంచానికి నష్టం జరిగినట్టు గగ్గోలు పెడతారు. మరణించే వాళ్ళు గిరిజనులు పేదవాళ్లు, అమాయకులు కాబట్టి ఎవరికీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అర్జున్ రెడ్డి దుయ్యబట్టారు.

Leave A Reply

Your email address will not be published.