Breaking News

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు కొయ్యూరు పోలీసులు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం.

0 22

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు కొయ్యూరు పోలీసులు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం.


అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలంలోని తాటిమానుపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇళ్లు కాలి పోవడంతో ఆయా కుటుంబీకులు నిరాశ్రయులయ్యారు. 

ఈ విషయం తెలుసుకున్న కొయ్యూరు పోలీసు అధికారులు స్పందించారు. 

సీఐ ఏ.స్వామినాయుడు ఆధ్వర్యంలో ఎస్సై రాజారావు, మంప ఎస్సై లోకేష్ కుమార్ తమ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. 


ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ తరపున రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. 

అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు తమ వంతు అండగా నిలిచి మానవత్వం చాటుకున్న పోలీసుల తీరు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.