Breaking News

కొయ్యూరు:ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు ప్రవేశాలకు ధరఖాస్తులు.

0 21

 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు ప్రవేశాలకు దరఖాస్తులు.

ప్రిన్సిపాల్ విటల్

పాడేరు ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు నందు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు ప్రవేశాలకు అడ్మిషన్లు కొరకు అభ్యర్థులు బాలురు,బాలికలు ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విటల్ తెలిపారు.6వ తరగతి వారికి బాలురు 30 మంది,బాలికలకు 30 మంది,7వ తరగతి వారికి బాలురు 6 మంది జాయిన్ అవుటకు ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విటల్ తెలిపారు.ప్రస్తుతం ఏకలవ్య స్కూల్ విద్యార్థులకు తరగతులు కొయ్యూరు ఏపీటీడబ్ల్యూఆర్ గురుకుల పాఠశాల వద్ద నిర్వహిస్తున్నారు.

అభ్యర్థులు ఆన్లైన్ లో https://twreisecet.apcfss.in ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని, ప్రారంభ తేదీ 27-02-2023 నుండి ఆఖరి తేదీ 15-04-2023 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.