Breaking News

గంజాయి కేసుల్లో ఉన్న నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించిన కొయ్యూరు పోలీసులు.

0 21

 గంజాయి కేసుల్లో ఉన్న నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించిన కొయ్యూరు పోలీసులు.


జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ స్వామి నాయుడు ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా,కొయ్యూరు మండల పరిధిలో గంజాయి కేసుల్లో అరెస్ట్ అయిన నేరస్తులకు కొయ్యూరు పోలీస్ స్టేషన్లో సత్ప్రవర్తన కొరకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కౌన్సెలింగ్ కు సుమారు 50 మంది పాత కేసుల్లో ఉన్న నేరస్తులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కొయ్యూరు రాజారావు వారితో మాట్లాడుతూ గంజాయి కేసుల్లో 2 కంటే ఎక్కువ కేసుల్లో ఉంటే పీడీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి కేసుల్లో ఉన్న ప్రతీ ఒక్కరు మీద సస్పెక్ట్ షీట్  ఓపెన్ చెయ్యడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. 

అదే విధంగా పాత నేరస్థులు అందరిని ఎమ్మార్వో కోర్ట్ నందు మంచి ప్రవర్తన కొరకు బైండోవర్ చెయ్యడం జరుగుతుందని తెలియ చెయ్యడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.