Breaking News

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన రత్నంపేట సర్పంచ్.

0 21

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన రత్నంపేట సర్పంచ్.

 వరుసగా మూడవ ఏడాది వైయస్ఆర్ ఆసరా రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మూడవ విడతగా 6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ముందుగా రత్నంపేట సర్పంచ్ పాటి నూకరత్నం కృతజ్ఞతలు తెలిపారు.

ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో వైయస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం లోని, రత్నంపేట గ్రామంలో సర్పంచ్ పాటి నూకరత్నం ఇంట్లో డ్వాక్రా మహిళలు టీవీ ముందు కూర్చొని సీఎం కార్యక్రమాన్ని వీక్షించారు.కార్యక్రమం అనంతరం సర్పంచ్ అలాగే మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


Leave A Reply

Your email address will not be published.