Breaking News

ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు.సాగు చేస్తే ఎందుకు కేసులు పెడతామంటున్నారు?

0 46

ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలిచ్చారు.సాగు చేయవద్దని ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారు.

సాగు చేస్తే మీపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.

ఇది కన్నంపేట గ్రామస్తుల ఆవేదన.


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు  ఎందుకూ పనికిరాని పుస్తకాల్లా మిగలబోతున్నాయి.

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయితీ లోని కన్నంపేట గ్రామస్తులకు 21 మందికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది.

ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు తీసుకున్న కొంతమందికి ఫారెస్ట్ అధికారులు గ్రామానికి వెళ్లి పట్టాలు తీసుకున్న భూమి వద్ద సాగు చేయొద్దని,సాగు చేస్తే మీపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కన్నంపేట గ్రామస్తులైన రేసుకట్ల రమణమ్మ, రేసుకట్ల అచ్చియమ్మ,నూకాలమ్మ,సోమెల జ్యోతి మరికొంతమంది వాపోతున్నారు.

గత 20 సంవత్సరాలుగా తాము సాగులో ఉన్నామని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చినందుకు ఎంతగానో సంతోషించామని,కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి సాగు చేయొద్దని అంటున్నారని, సాగు చేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని,ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు తిరిగి ఇచ్చేమని అంటున్నారని,ఏవో పుస్తకాలు తీసుకొచ్చి రెండు చోట్ల సంతకాలు కూడా పెట్టించుకున్నారని, దీంతో పాటు మీపై కేసు పెడుతున్నాము సంతకాలు పెట్టాలని కాలీ వైట్ పేపర్ తీసుకొచ్చారని,కాలీ వైట్ పేపర్లో తాము సంతకాలు పెట్టలేదని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారూ మీ వల్లే మాకు పట్టాలు వచ్చాయి కనుక మీరే మాకు న్యాయం చేయాలంటున్నారు కన్నంపేట గ్రామస్తులు.

ఈ మేరకు కొయ్యూరు జడ్పిటిసి వారా నూకరాజు,డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు గ్రామస్తులను కలిసి విషయం అడిగి తెలుసుకున్నారు.

మీకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఎందుకిచ్చారు? మళ్లీ ఎందుకు తిరిగి అడుగుతున్నారు? తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.