Breaking News

అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్నారికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన నేను సైతం శివప్రసాద్.

0 21

 దురదృష్టవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్నారికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన అరకు ఎంపీ  గొడ్డేటి మాధవి భర్త నేను సైతం శివ ప్రసాద్.


అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం,వంజంగి పంచాయతీ,దొడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య,ఈశ్వరమ్మ దంపతుల కుమార్తె మహి (6) ఉగాది రోజున దురదృష్టవశాత్తు మంటలు అంటుకొని శరీరమంత కాలిపోయి నర్సీపట్నం ఉమా నారాయణ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని సంబంధిత వ్యక్తుల ద్వారా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి  తెలుసుకున్నారు.

ఎంపీ గొడ్డేటి మాధవి అందుబాటులో లేనందున ఈ విషయాన్ని తన భర్త నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్  కి తెలుపగా హుటాహుటిన నర్సీపట్నం ఉమా నారాయణ హాస్పిటల్ కి చేరుకొని చిన్నారిని పరామర్శించి,ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులు,వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుని,మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులను కోరి చిన్నారి త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించి,ఎల్లవేళలా తమ అండదండలు ఉంటాయని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చి వైద్య ఖర్చుల నిమిత్తం 5000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నేను సైతం డైరెక్టర్ బాలకృష్ణ (మాస్టారు) ,పంచడా శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.