కొయ్యూరు లో బంద్
రాష్ట్ర ప్రభుత్వం బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో ఆదివాసీ సంఘాలు,ఉద్యోగ సంఘాలు, అఖిలపక్ష నేతలంతా ఈనెల 31న బంద్ కి పిలుపునివ్వడంతో అల్లూరి జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో ప్రశాంతంగా బంద్ నిర్వహించారు.
ఎటువంటి అలజడలు జరగకుండా కొయ్యూరు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ గా వెళ్లి పూలమాలలు వేశారు. రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలి అంటూ నినాదాలు చేశారు.
ఈ యొక్క బంద్ లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ పాల్గొని బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ మండల కన్వీనర్ బూరుగులయ్య, జేఏసీ మహిళా నేత శ్యామల వరలక్ష్మి,ఆదివాసీ ప్రజా చైతన్య సంఘం అధ్యక్షుడు పాడి లోవరాజు, సీపీఎం నాయకుడు సూరిబాబు, అప్పలనాయుడు,ఉద్యోగ సంఘాల నాయకులు,టీడీపీ,జనసేన నాయకులు పాల్గొన్నారు.