గొడ్డలితో దాడి చేసిన ఘటనలో వ్యక్తి మృతి.
సంతోష్ (మృతదేహం) |
అల్లూరి జిల్లా: జీకే వీధి మండలం చాపరాతి పాలెం వద్ద ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణం నిమిత్తం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మధ్య వివాదం.
రూపేష్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి..సంతోష్ అనే వ్యక్తి మృతి.
గొడ్డలితో దాడి చేసిన రూపేష్ కాసేపు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసి అక్కడ నుంచి పరారయ్యాడు.
అల్లూరి జిల్లాలో పాడేరు మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో సెల్ టవర్ సిగ్నల్ నిమిత్తము ఎయిర్టెల్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపద్యంలో సెల్ టవర్ పనుల నిమిత్తము ఉత్తరప్రదేశ్ కు చెందిన 11 మంది కార్మికులు చాపరాతిపాలెంలో సెల్ టవర్ నిర్మాణ పనులకు గత కొన్ని రోజులుగా సెల్ టవర్ పనులు చేస్తున్నారు. వరసకు అన్నదమ్ములు అయిన రూపేష్, సంతోష్ వీరిద్దరూ నిన్న స్వల్ప ఘర్షణ పడి రాత్రి రెండు గంటల సమయంలో రూపేష్ అనే వ్యక్తి సంతోష్ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయగా సంతోష్ కి తల పైన మెడ పైన బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జీకే వీధి పోలీసులు సీఐ అశోక్ కుమార్, ఎస్సై అప్పలసూరి తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.పంచనామ నిమిత్తము చింతపల్లి ఏరియా హాస్పిటల్ కు తరలించనున్నారు.