ఆకతాయి పని వల్ల ఏం జరిగిందో చూడండి.
కృష్ణా జిల్లా,గుడివాడ: కదిలే ట్రైన్ ఎక్కాలని ఇద్దరు మిత్రులు సరదాగా వేసుకున్న పందెం కారణంగా ఇంటర్మీడియట్ విద్యార్థి కాలు పోగొట్టుకున్నాడు. కృష్ణాజిల్లా గుడివాడలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు, గుడివాడ రైల్వే స్టేషన్ సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో స్టేషన్లోకి వస్తున్న గూడ్స్ రైలు ఎక్కాలని ఇద్దరు విద్యార్థులు సరదాగా పందెం కాసుకున్నారు. రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో ఇంటర్మీడియట్ విద్యార్థి కాలు పోగొట్టుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆకతాయిగా వేసుకున్న పందెం కారణంగా, జీవితం నాశనం కావడంతో యువకుడి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.