Breaking News

వైసీపీ,టీడీపీ పార్టీ లు గిరిజన వ్యతిరేకులు-బీజేపీ నేత ఉమా మహేశ్వర రావు.

0 22

 వైసీపీ,టీడీపీ పార్టీ లు గిరిజన వ్యతిరేకులు-బీజేపీ నేత ఉమా మహేశ్వర రావు.

సీఎం జగన్,నారా లోకేష్ దిష్టి బొమ్మలు దహనం చేసిన బీజేపీ శ్రేణులు


అల్లూరి జిల్లా, అరకు : వైసీపీ, టీడీపీ పార్టీ లు రెండు గిరిజన వ్యతిరేక పార్టీలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమా మహేశ్వర రావు అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు అధ్యక్షతన అరకు లో జరిగిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కురుస ఉమా మహేశ్వర రావు పాల్గొన్నారు.ముందుగా పట్టణ పుర వీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.


బోయ, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో తీర్మానం చెయ్యడం, అలాగే టీడీపీ నేత నారా లోకేష్ ఇటీవల చేపడుతున్న యువగళం పాదయాత్ర లో బోయ లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దత్తు ఇస్తున్నట్లు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ నేత నారా లోకేష్ దిష్టి బొమ్మలను దహనం చేసి బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమా మహేశ్వర రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ పార్టీ లు రెండు గిరిజన ప్రజల గొంతు కొయ్యడానికే సిద్ధ పడటం అన్యాయం అన్నారు.పాలక వైసీపీ, ప్రతి పక్ష టీడీపీ పార్టీ లు రెండు కుమ్మక్కయ్యి గిరిజన రిజర్వేషన్ లను దెబ్బ కొట్టే ప్రయత్నం మొదలు పెట్టిందన్నారు.దీనిపై స్థానిక వైసీపీ, టీడీపీ గిరిజన నాయకులు తమ వైఖరి స్పష్టం చెయ్యాలన్నారు.పార్టీ రాష్ట్ర అధినేతల దగ్గర బోయ లను ఎస్టీ జాబితాలో కలపడం కుదరదు అని చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చెయ్యడం లేదన్నారు.ఈ గిరిజన రిజర్వేషన్ లు లేకపోతే మీకు ఈ రాజకీయ పదవులు వచ్చేవా అని ప్రశ్నించారు. స్థానిక గిరిజన వైసీపీ, టీడీపీ నేతలు ఉత్తుతి మద్దత్తును గిరిజన ప్రజలకు చూపి రాష్ట్ర పార్టీ ల దగ్గర ఒంగి ఒంగి దండాలు పెట్టడం సిగ్గు మాలిన చర్య అన్నారు.తక్షణమే వైసీపీ, టీడీపీ లు బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అనుకూలంగా ఇచ్చిన ప్రకటనలను వెనక్కి తీసుకుని గిరిజన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అరకు అసెంబ్లీ కన్వినర్ బిసాయి ధర్మరాజు, అరకు మండల అధ్యక్షులు రామ్ చంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు శరబ వేమన, జిల్లా కార్యదర్శి జన్ని సత్యవతి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు తాంగుల సత్యవతి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.