Breaking News

కొయ్యూరు: ‘జగనన్న చేయూత’ లబ్ధిదారులు సహపంక్తి భోజనం ఏర్పాటు.

0 25

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: పాడేరు నియోజకవర్గ శాసనసభ్యులుగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు విజయం సాధించడంతో కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ కిష్టారం గ్రామంలో జగనన్న చేయూత లబ్ధిదారులు సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆడాకుల ఎంపీటీసీ సెగ్మెంట్ ఆడాకుల,ఆర్.కొత్తూరు గ్రామ పంచాయతీలలో గల సుమారుగా వెయ్యి మంది వైయస్సార్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సహపంక్తి భోజనాల్లో వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ

ఈ కార్యక్రమంలో కొయ్యూరు మండలం వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలలో మనం అందరం కలిసికట్టుగా స్థానిక సంస్థలను ఎదుర్కొని వాటిలో మన వైయస్సార్ పార్టీ జెండా విజయకేతనం దిశగా మనమంతా అడుగులు వేయాలని ధైర్యాన్ని నింపారు. ఆడాకుల,ఆర్ కొత్తూరు పంచాయతీలలో రానున్న స్థానిక సంస్థలలో సర్పంచులను,ఆడాకుల సెగ్మెంట్ ఎంపీటీసీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు కి,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి గిఫ్ట్ గా ఇద్దామని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు ఆడాకుల సెగ్మెంట్ లో ఉన్న గ్రామ ప్రజలందరికీ నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన మాట ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ పిఎసిఎస్ చైర్మన్ అప్పన గజ్జయ్య దొర,గమదం వీర బ్రహ్మం,ఆర్ కొత్తూరు సీనియర్ నాయకులు గాడి అచ్చిరాజు,మాజీ సర్పంచ్ గమదం గంగయ్యమ్మ,మాజీ ఎంపీటీసీ గమదం రాములమ్మ,బోడారపు అప్పారావు,రెడ్డి నాయుడు,రేసుకట్ల కొండబాబు,ముకే వెంకటరమణ,కుడుములు కన్నయ్యదొర,ఇప్పల నగన్నదొర,వేలంపర్తి నూకరాజు,ముత్యాల లోవరాజు,కొరుప్రోలు కొండబాబు,జంపా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.