Breaking News

వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే.

0 20

వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే.


  అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం,రాజేంద్రపాలెం లోని అల్లూరి సీతారామరాజు కళామందిందిరం వద్ద పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత సంబరాలు ప్రారంభించారు.


 ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి మట్లాడుతూ కొయ్యూరు మండలంలో 679 డ్వాక్రా సంఘాలకు గానూ,7119 మంది మహిళల ఖాతాలలో 3 కోట్ల 20 లక్షల 60 వేల 7 వందల 24 రూపాయలు మొత్తం జమ చేయనున్నట్లు తెలియజేశారు.

మూడు కోట్ల 20 లక్షల 60 వేల 7వందల 24 రూపాయల చెక్కును డ్వాక్రా మహిళలకు అందించారు.


అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


 ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జల్లిబాబులు,ఎంపిపి బడుగు రమేష్ బాబు,జెడ్పిటిసి వారా నూకరాజు, వైస్ ఎంపిపి లు అప్పన వెంకట రమణ,అంబటి నూకాలమ్మ, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,బిసి కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి, సచివాలయం కన్వీనర్ ఇంచార్జ్ బండి సుధాకర్,ఎఎస్ఆర్ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు దోని బాబ్జి,కొయ్యూరు ఎంపిటిసి మల్లిఖార్జునరావు,కొయ్యూరు మండల ఎంపిటీసీ లు,సర్పంచులు, వెలుగు ఏపీఎం,సీసీ లు,వీఓఏ లు, వార్దు మెంబర్ లు,సచివాలయం కన్వీనర్ లు,గృహ సారథులు,పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.