*ఆ గెలుపుకి పొంగిపోలేదు..ఈ ఓటమికి కృంగిపోము.
*ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పులు గౌరవించాల్సిందే.
-కొయ్యూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పు ఎవరైనా సరే గౌరవించి తీరాల్సిందేనని టీడీపీ ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ అన్నారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ,జనసేన,బిజెపి కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఓటమి జీర్ణించుకోలేని విషయమే అయినప్పటికీ ప్రజాతీర్పుని గౌరవిస్తూ లోపం ఎక్కడ జరిగిందో సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయం దిశగా సాగుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు.
ఓటమికి కారణాలు అనేకం అయినప్పటికీ కొన్ని పరిగణన లోకి తీసుకోక తప్పదన్నారు.గిడ్డి ఈశ్వరి కి వ్యక్తిగతంగా దగ్గరగా వున్న ఓటు బ్యాంకు మతపరమైన ఓటు బ్యాంకు,పొత్తు వలన కాస్త తగ్గిన మాట వాస్తవమని,టికెట్ ప్రకటన మొదట బీజేపి తర్వాత రమేష్ నాయుడు అని చిట్టచివరకు సమయం మించిపోయే సమయంలో ఈశ్వరి కి టికెట్ కేటాయించడం వల్ల ప్రచారానికి సమయం లేకపొవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు అన్నారు.
ఇక పాడేరు టిడిపి ఓవర్ లోడ్ సమస్య తెలిసిందేనని,బారీ నాయకత్వం కలిగిన పాడేరు ప్రతీ సారీ ఓటమికి కారణం వర్గ పొరు మాత్రమేనని తెలిపారు.నాకు లేదా నీకు వుండకూడదు అనే ధోరణితో కొంతమంది నాయకులు తెరవెనుక వెన్నుపోటు సరాసరి
అంతకు మించి వైసిపి వాలంటీర్లు ఇతర నాయకుల విష ప్రచారం ఎన్నికల కోడ్ వల్ల పెన్షన్ బ్యాంక్ లో జమ అయితే,టీడీపీ గెలిస్తే పెన్షన్ బ్యాంక్ కు వెళ్లి తీసుకోవాలి అని ప్రచారం చెయ్యడం వైసిపి కి కలిసొచ్చిందని అన్నారు.తిప్పికొట్టడంలో మా వాళ్లు విఫలం అయింది వాస్తవమని చెప్పారు.ఏది ఏమైనా రాష్ర్ట ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి మాకు.. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించడం సంతోషకరమైన విషయమన్నారు.ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందరికీ అందేలా మా వంతు కర్తవ్యం నిర్వర్తిస్తామని తెలిపారు.ఇక మా అభ్యర్ధి గిడ్డి ఈశ్వరి దిగులు చెందవలసిన అవసరం లేదని,గతంలో తెలుగుదేశం పార్టీకి టికెట్ ఉండేది కాదని, ప్రతిసారి పొత్తులలో భాగంగా వేరే పార్టీకి కేటాయించే వాళ్లని,
గిడ్డి ఈశ్వరి రాకతో టికెట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే వస్తుందని,
ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలెత్తుకొని నిలబడేలా చేసినటువంటి అంశమని ఆశాభావం వ్యక్తంచేశారు.ఓటు బ్యాంక్ విషయంలో గతంలో పొత్తుల్లో ఒక అభ్యర్థికి 17,000 ఓట్లు వస్తే గతసారి గిడ్డి ఈశ్వరి కి దాదాపు 26,000 పైచిలుకు ఓట్లు వచ్చాయని, కానీ ఈసారి గిడ్డి ఈశ్వరి కి దాదాపు 50 వేల ఓట్లు ప్రజా మద్దతు కలిగిన ఓటు బ్యాంకు రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. రాబోయే ఎన్నికల నాటికి లక్ష ఓట్లు పైచిలుకు తెలుగుదేశం పార్టీ సాధించేలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిస్తూ అన్ని విధాల ప్రజల మధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతామని జంపా వెంకటరమణ తెలిపారు.