Breaking News

పాడేరు: గ్రామ సభ తీర్మానం – పీసా చట్టం సభ్యులు ఆమోదం లేకుండా రోడ్ విస్తరణ పనులు చేయొద్దు.

0 31

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం: సలుగు పంచాయితీ,డల్లపల్లి గ్రామంలో టూరిజం శాఖ పేరుతో రోడ్ విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గమనించిన స్థానిక యువకులు గెమ్మెలి సత్యారావు పీసా చట్టం గ్రామ కమిటీ సభ్యులు వెంటనే రహదారి విస్తరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

రహదారి లేని గ్రామాలు చాలా ఉన్నాయని,సప్పిపుట్టు నుంచి డల్లపల్లి వరకు రహదారి లేదని,డల్లపల్లి నుంచి సలుగు పంచాయితీ కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరం అని పంచాయితీ కేంద్రానికి వెళ్ళాలంటే సరైన రహదారి సౌకర్యం లేదని మండిపడ్డారు.రహదారి లేని గ్రామాలకు రహదారి నిర్మాణాలు చేయకుండా…టూరిజం అభివృద్ధి కోసం రోడ్ విస్తరణ పనులు చేయడం అవసరమా అని ఎద్దేవా చేశారు.రోడ్ విస్తరణ పనులు నిలిపివేయకపోతే భవిష్యత్తులో ఉధృతంగా ఉద్యమం చేస్తామని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.