Breaking News

జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశం.

0 24

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అఖిలపక్ష ప్రతిపక్షాలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ,పార్టీ జెండా పేరు చెప్పుకుంటూ,జగనన్న పేరు చెప్పుకుంటూ, హంగామాలు చేసి ఎలక్షన్స్ ముందు నుంచి ఎలక్షన్ అయ్యే వరకు కుళ్ళు,కుతంత్రాలు,రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్సిపి లో కొందరు మోసపూరిత నాయకులు ఎలాంటి కుట్రలు చేసినా రాష్ట్రంలో,పాడేరు నియోజకవర్గం లో,అరకు పార్లమెంట్ లో విజయం సాధించేది జగనన్న సూచించిన అభ్యర్థులు మాత్రమేనని రీమల గంగాధర్ అన్నారు. పార్టీ కార్యకర్తలు,పార్టీ సేవకులు,ఆ భగవంతుడి దయ,ప్రజల ఆశీర్వాదాలతో వైసీపీ విజయం సాధించిన తర్వాత వైయస్సార్ సిపి పార్టీలో ఎవరైతే మోసపూరిత నాయకులు ఉన్నారో వాళ్లకు సరైన గుణపాఠం ఉంటుందని,పార్టీని మోసం చేసిన వాళ్లను ఎవర్నీ వదిలిపెట్టను అంటూ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగాధర్ ఆసక్తికర వ్యాఖ్యలతో పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగాధర్ అంటున్నట్లు సొంత వైసీపీ పార్టీ నాయకులే పార్టీని మోసం చేశారా? అలా మోసం చేసిన వ్యక్తులు ఎవరు? ఒకవేళ ఇదే జరిగితే సొంత పార్టీనే మోసం చేయడానికి గల కారణాలు ఏంటి? అనే మీమాంస నెలకొంది.ఈ పూర్తి విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.