*ఎన్నికల కౌంటింగ్ కి వెళ్లే ఏజెంట్లు ఎన్నికల నిబంధనలు పాటిద్దాం.
*-కూటమి ఉమ్మడి తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి
అల్లూరి జిల్లా పాడేరు:ఈనెల 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ కి వెళ్లే ఏజెంట్లు ఎన్నికల నిబంధనలు పాటించి సజావుగా ఓట్లు లెక్కింపు జరిగేలా చూడాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి ఉమ్మడి తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4వ తారీఖున కౌంటింగ్ కు వెళ్లేవారు ఎవరు కూడా ముందు రోజు ఆల్కహాల్ తీసుకోకూడదని కౌంటింగ్ రోజు ఉదయం ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అనే దాని కోసం బ్రీత్ అనలైజెర్ టెస్ట్ చేసి ఆల్కహాల్ తీసుకున్నట్లు తెలిస్తే కౌంటింగ్ కు అనుమతించరని,కౌంటింగ్ కి వెళ్లే ఏజెంట్లు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఏజెంట్లను సూచించారు.
Prev Post