Breaking News

కొయ్యూరు లో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు.

0 12

అల్లూరి జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో నందమూరి తారక రామారావు 101 వ జయంతి వేడుకలు మాజీ జిసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవివి ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారనీ,అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా పార్టీ పెట్టిన ఆరు నెలల లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత నందమూరి తారక రామారావు కి దక్కుతుందని తెలిపారు. ఆయన నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు,ఎస్ కే ఖాన్,మాకాడ బూరుగులయ్య,టింకు,ఎం వీరయ్యదొర,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.