Breaking News

పాడేరు నియోజకవర్గంలో విశ్వేశ్వరరాజు విజయం ఖాయం: జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్.

0 20


అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తమ వైకాపా పార్టీ పై ప్రజలు సుముఖంగా ఉన్నారని జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్ అన్నారు.ఎన్నడూ లేనివిధంగా ఈ ఐదేళ్ళ పరిపాలనలో తమ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజల పక్షపాతిగా ఉండడం,అలాగే పాడేరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచి మనసున్న వ్యక్తి,అందరితో కలుపుగోలుగా వెళ్ళే వ్యక్తి అయిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు ను ప్రకటించడం మంచి పరిణామమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు,ప్రజలకు చేసిన మేలే ఈ సారి మళ్లీ వైకాపా పార్టీ గెలుపుకు నాంది అవుతుందని తెలిపారు. కనుక వచ్చే నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం,పాడేరు నియోజకవర్గంలో మత్స్యరాస విశ్వేశ్వరరాజు గెలుపు ఖాయమని జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్ అన్నారు. కనుక ఎవరూ అపోహలు పడవద్దని,పాడేరు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ హ్యాట్రిక్ కొట్టబోతుందని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.