Breaking News

అనుమానాలు వద్దు.. గిడ్డి గెలుపు ఖాయం: కోడా వెంకటసురేష్ కుమార్

0 77

*అనుమానాలు వద్దు.. గిడ్డి గెలుపు ఖాయం.
*రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్.
అల్లూరి జిల్లా,పాడేరు:సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఈ నెల 13న జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా గిడ్డి ఈశ్వరి ఎగరవెయ్యబోతుందని దానికి ఎవరు అనుమానాలు పడద్దని రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకటసురేష్ కుమార్ అన్నారు.పాడేరు నియోజకవర్గం పై ఎంతోమంది ఎన్నో సర్వేలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ గిడ్డి ఈశ్వరి గెలవబోతున్నారని చెప్తుంటే కొంతమంది గిడ్డి ఈశ్వరికి పడని వ్యక్తులు ఏదేదో మాట్లాడడం చాలా విచిత్రంగా ఉందని ఆయన అన్నారు.పార్టీ బలోపేతానికై పాడేరు నియోజకవర్గంలో గిడ్డి ఈశ్వరి తో పాటు కార్యకర్తలంతా పనిచేసి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేశారని ఆ దిశగా సర్వేలతో పాటు మేధవులే గిడ్డి ఈశ్వరి గెలవబోతుందని చెప్తుంటే కొందరు ఆసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు.ఏది ఏమైనా వచ్చే నెల నాలుగవ తారీఖున ఇటువంటి అనుమానాలు ఉన్న వ్యక్తులకు దిమ్మదిరిగే సాక్ గిడ్డి ఈశ్వరి ఇవ్వబోతున్నారని ఆయన అన్నారు.లెక్కలు రాస్తూ కూర్చోండి తెదేపా పార్టీ పాడేరు నియోజకవర్గంలో గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.