Breaking News

దివంగత మాజీ ఎంపీపీ బడుగు రామరాజ్యం 8వ వర్థంతి వేడుకలు.

0 134

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని కించవానిపాలెం లో దివంగత మాజీ ఎంపీపీ బడుగు రామరాజ్యం 8వ వర్థంతి ఆయన స్మారక స్థూపం వద్ద బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.


ప్రస్తుత ఎంపీపీ బడుగు రమేష్, జడ్పీటీసీ వారా నూకరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్ళి సుబ్బారావు,సీపీఐ నాయకులు బాలేపల్లి వెంకటరమణ,పొట్టిక సత్యనారాయణ,ఇరువాడ దేముడు,సతీష్,దివాణం తదితరులు రామరాజ్యం ఫోటో కి పూలమాల వేసి,పూలు జల్లి ఘన నివాళులు అర్పించారు.పలవురు వక్తలు మాట్లాడుతూ దివంగత మాజీ ఎంపీపీ బడుగు రామరాజ్యం నాలుగు దశాబ్దాలు పాటు సీపీఐ పార్టీకి, గిరిజన ప్రాంత ప్రజలకు అందించిన సేవలు మరువలేనివి కొనియాడారు. ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ.. తన అన్న దివంగత నేత రామరాజ్యం యువకునిగా ఉన్నప్పుడే ప్రజా సమస్యలపై పోరాడుతూ సీపీఐ పార్టీలో ఎనలేని సేవలు చేశారని అన్నారు. ఒక రకంగా తాను రాజకీయాల్లోకి రావడానికి తన అన్న రామరాజ్యం స్పూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ,పాటి శేఖర్,గోకిరి చిన్నారావు,పార్టీలకు అతీతంగా పలువురు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.