మండల అధ్యక్షుడు జల్లి బాబులు ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం.
అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలం బకులూరు పంచాయితీ లోని అంకంపాలెం గ్రామంలో మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు…మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూనే..గత టీడీపీ ప్రభుత్వానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం వివరించారు.ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మరలా ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి ని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పొట్టిక శ్రీను,వాలంటీర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.