అల్లూరి జిల్లా పాడేరు మండల కేంద్రంలో గురుకుల మొదటి సంవత్సరం ప్రవేశానికి థరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థుల బాలలకు పాడేరు ఏపీటీడబ్ల్యూఆర్ గురుకుల బాలికల కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారని అయితే అప్లై చేసుకున్న ప్రతి గిరిజన విద్యార్థిని,విద్యార్థులకు సీట్లు రాలేదని కనుక సీట్లు పెంచాలని పాడేరు పీఓ వి.అభిషేక్,డిడి కొండలరావు ను వినయ పూర్వంగా కలిసి సీట్లు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా పివో వి.అభిషేక్ అందరికీ సీట్లు వచ్చేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని ఎస్ ఎఫ్ ఐ నాయకులు జీవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హాజరైన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవన్ కృష్ణ మాట్లాడుతూ సీట్లు పెంచాలని,అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. అయితే 1700 మంది బాలురకు అప్లై చేసుకున్నాక కేవలం 800 మందికి మాత్రమే సీట్లు కేటాయించడం దారుణం అన్నారు.. తప్పకుండా సీట్లు పెంచి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.. సమాచారం తెలియక ఈరోజు జరిగిన కౌన్సిలింగ్ లో అనేక మంది రాలేకపోయారని ఆయన హెచ్చించారు. విద్యార్థుల చదువులతో ఆటలు ఆడుకోవద్దని,మిగిలిన 800 బాల, బాలికలకు కూడా సీట్లు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన అదే 800 విద్యార్థులతో ఐటిడిఎ ఎదుట ఆందోళన చేయటానికి కూడా వెనుకాడబోమని అధికారులు హెచ్చించే ప్రయత్నం చేశారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్,మచ్చరాజు,జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.