Breaking News

వీర బ్రహ్మేంద్రస్వామి కళ్యాణ వేడుకల్లో గిడ్డి ఈశ్వరి

0 21

*వీర బ్రహ్మేంద్రస్వామి కళ్యాణ వేడుకల్లో గిడ్డి ఈశ్వరి.
*నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యలతో ఉండాలని పూజలు.
అల్లూరి జిల్లా పాడేరు:వీర బ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ వేడుకల్లో భాగంగా చుండ్రు పుట్టులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న కళ్యాణ వేడుకల్లో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పాల్గొని నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693) భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి.ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు. బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీరప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్ర దేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది. ఆంగ్లేయ, మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక, రాజకీయ పరిణామాలు సూచింపబడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు,వింతలూ,చోద్యాలు,బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి.ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింపబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమేని అన్నారు. ఈ కార్యక్రమంలో భూ రెడ్డి నాగేశ్వరావు బుద్ధ జ్యోతి కిరణ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.