రావణాపల్లి లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్, డైరెక్టర్.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయితీ గ్రామంలో ఈరోజు చింతపల్లి ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్..మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ,సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుండి ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించారు.
గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేని పరిస్థితిని..ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఎలా అమలు చేస్తున్నారో ప్రజలకు ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ వివరించారు.రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ సర్పంచ్ పొడుగు చంద్రరావు,గృహ సారధులు నడిగట్ల దేముడు,వాకపల్లి కరుణ్ కుమార్,పొడుగు బాలరాజు వాలంటీర్లు పాల్గొన్నారు.