అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని నల్లగొండ,కినపర్తి,చిట్టింపాడు, మూలపేట,డౌనూరు పంచాయితీలలో విస్తృతంగా టిడిపి శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మాజీ జిసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్ టిడిపి,జనసేన,బిజెపి కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ని సైకిల్ గుర్తుపై,బిజెపి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కు కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గాడి శ్రీరామ్మూర్తి,లోతా భీమరాజు,కాకురు చందర్రావు,పొత్తూరు దేవుడు,టింకు శ్రీను బిజెపి నాయకులు అరిమెల రాజు,అరిమెల శంకర్రావు,బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు పలువురు టిడిపి,బిజెపి,జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.