మిషన్ వాత్సల్య ధరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలి:సీఆర్పీఎఫ్ అల్లూరి జిల్లా కన్వీనర్ డాక్టర్ బాకా లవకుశ.
మిషన్ వాత్సల్య ధరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలి:సీఆర్పీఎఫ్ అల్లూరి జిల్లా కన్వీనర్ డాక్టర్ బాకా లవకుశ.
లవకుశ (సీఆర్పీఎఫ్ జిల్లా కన్వీనర్) |
మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ పథకంలో చేరేందుకు అనాధ,అభాగ్య పిల్లల నుండి ధరఖాస్తుల గడువును ఈనెల 15 నుండి మరో నెల రోజులు పొడిగించి బాలల హక్కుల పరిరక్షణకు తోడ్పాటును అందించే చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ డాక్టర్ బాకా లవకుశ అన్నారు.
సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మరింత మంది అనాధ,అభాగ్య పిల్లలకు ఈ పథకం చేరువ కావాలంటే గడువు తేదీని పొడిగించాలని కోరారు.సాంకేతిక కారణాలు,మండల తహశీల్దార్ లు,విద్యాశాఖ అధికారులు,మునిసిపల్ శాఖ అధికారులు బాలలకు సంబంధించిన వివిధ ధ్రువ పత్రాలు ఇప్పటికీ పెండింగ్ లో ఉండి అందించ పోవడం వల్ల అనుకున్న ధరఖాస్తులు అందించలేక పోయారన్నారు.ఇదే విషయాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ,రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ గొండు సీతారాం,ఇతర ఉన్నతాధికారుల దృష్టికి ఇప్పటికే లేఖలు రూపంలో తెలియజేసినట్లు తెలిపారు.తమ ఫోరం వాదనను బలపరచి గడువును ప్రభుత్వం పెంచుతుందన్న వాదనతో ఉన్నామని లవకుశ అన్నారు.