Breaking News

సంక్షేమ పాలనకే పట్టం కట్టండి- కొయ్యూరు వైసీపీ నాయకులు

0 131

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొయ్యూరు మండల వైసీపీ నాయకులు సురేంద్ర పాలెం,కొయ్యూరు, రాజేంద్ర పాలెం,సోలాబు,జోగంపేట గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు,పెత్తందార్లకు మధ్య జరిగే ఈ ఎన్నికల యుద్ధంలో పేదల పక్షాన అండగా నిలిచిన వైయస్సార్ సీపీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలపాలని,సంక్షేమ పాలనకే పట్టం కట్టాలని అన్నారు.

జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేసిందని, ప్రజలకోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల పక్షాన నిలబడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని అన్నారు. వైసిపి పార్టీ బలపరిచిన పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ను, అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి ని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కనుక పేదలు బాగుండాలన్నా,బాగుపడాలన్నా వైసీపీ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు తెలపాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్,మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,ఏఎంసీ చైర్పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీ లు అప్పన వెంకటరమణ,అంబటి నూకాలమ్మ,పీఎసీఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు,జేసీఎస్ కన్వీనర్ బండి సుధాకర్,జిల్లా కార్యదర్శి,మండల మహిళా అధ్యక్షురాలు సడ్డా సావిత్రి, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ గాడి అచ్చిరాజు,వైసీపీ నాయకులు నర్సి కృష్ణ,పాటి శేఖర్,గోకిరి చిన్నా,నర్సి కిరణ్,కాకరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.